౧ సమూయేలు ౧౬:౭మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
ఒక వ్యక్తి ఉండేవాడు, అతను ఎప్పుడూ మంచి పనులు చేయడానికి ప్రయత్నించేవాడు కష్టపడి పని చేసేవాడు, ఇతరులకు చేయుతన్నిచేవాడు, క్రమశిక్షణతో బతికేవాడు. కాని అతని మనసులో ఒక లోతైన కోరిక ఉండేది। ఎవరైనా తనను గుర్తించాలి, ప్రశంసించాలి, తన గురించి మంచి మాటలు చెప్పాలి
అతని పనులు సరైనట్లే కనిపించేవి కాని అతని శాంతి మాత్రం ప్రజల అభిప్రాయాలపై ఆధారపడి ఉండేది. కొన్నిసార్లు ప్రజలు అతన్ని మెచ్చుకున్నారు, కొన్నిసార్లు పట్టించుకోలేదు.
నెమ్మదిగా అతను ఒక నిజం గ్రహించాడు మనుషుల ప్రసంస ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ప్రజలకు నచ్చకపోతే వారిని సంతోషపెట్టడానికి తనను తాను మార్చుకోవాల్సిన ఒత్తిడిని అనుభవించాడు. కొన్నిసార్లు, తన విలువలకు వ్యతిరేకంగా కూడా వెళ్లాలని అనిపించింది. ఎందుకంటే ప్రజలను ఆకట్టుకోవడం అంటే ఎప్పుడూ సరైనదాన్ని చేయడం కాదు వారికి నచ్చినదాన్ని చేయడం.
ఇదే మనిషి హృదయ సమస్య:
- ప్రజల అభిప్రాయాలు మారుతాయి
- వారి అంచనాలు మారిపోతాయి
- ఈరోజు నచ్చింది రేపు నచ్చకపోవచ్చు
మనం కూడా అలానే చేస్తూ ఉంటామేమో గుర్తింపు కోసం గమనించబడాలనే ఆశతో
సత్యం కోసం కాదు ఒక నాడు అతను వాక్యము చదువుతున్నప్పుడు ఒక వాక్యం అతని హృదయాన్ని తాకింది:
“మనుషులు బయటికి కనిపించేది చూస్తారు,
కానీ యెహోవా హృదయమును చూస్తాడు.”
అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు
మనుషులు చర్యలను చూస్తారు —
దేవుడు ఉద్దేశ్యాన్ని చూస్తాడు.
మనుషులు సాధనలను గుర్తిస్తారు —
దేవుడు నిష్కపటతను గుర్తిస్తాడు.
మనుషులు బాహ్యంగా ఆకట్టుకునేదాన్ని మెచ్చుకుంటారు —
కాని దేవుడు నిజాయితీని విలువైనదిగా చూస్తాడు.
అతను గ్రహించాడు:
మనుషుల దృష్టిని గెలుచుకోవడానికి జీవించడం వల్ల
మనము మన నిజాయితీ నుండి ఎడమవుతాము
కొన్నిసార్లు సరైన దారి నుండి కూడా తొలగాయిపోతము
కాని దేవుని కోసం జీవించడం స్వేచ్ఛను ఇస్తుంది ఎందుకంటే దేవుడు మనల్ని నటించమని, ఆకట్టుకోవమని పిలవడు నిజమైనవారిగా ఉండమంటాడు.
అందుకే అతను తనను తాను ఇలా ప్రశ్నించుకోవడం ప్రారంభించాడు:
“ఇది నేను ముఖ్యంగా కనిపించడానికి చేస్తున్నానా…
లేదా ఇది నిజంగా మంచిదా?”
“నేను సహాయం చేస్తున్నది ప్రశంసల కోసమా…
లేదా ప్రేమతో చేస్తున్నానా?”
“నా జీవితం ప్రజల అంచనాలకు తగిలేలా మార్చుకుంటున్నానా…
లేదా దేవుని ఉద్దేశ్యం ప్రకారమా?”
అతని హృదయం మెల్లగా మారింది.
అతను ప్రసంసల కోసం పరుగెత్తడం ఆపేశాడు అభిప్రాయాల ద్వారా తన విలువను కొలవడం ఆపేశాడు. ఎవరూ చూసిన చూడకపోయినా నిజాయితీని ఎంచుకున్నాడు.
ఎందుకంటే అతను గ్రహించాడు —
మనుషుల అంగీకారం నాజూకైనది —
కాని దేవుని అంగీకారం ఆత్మను మారుస్తుంది.
ఆనాడు నుంచి —
అతను ప్రజలను ఆకట్టుకోవడానికి కాదు…
దేవుని గౌరవించడానికి
నిష్కపటమైన మరియు విశ్వాసమున్న హృదయంతో జీవించడం ప్రారంభించాడు.
ముగింపు ప్రార్థన
యేసయ్యా, మనుషుల ప్రసంసల కంటే నీ ఆమోదాన్ని కోరటం నేర్పించు. నా హృదయాన్ని పరిశీలించు, నా ఉద్దేశ్యాలను శుద్ధి చేయు, నిజాయితీతో, వినయంతో, సత్యంలో జీవించేటట్లు చేయు.
ఎవరూ చూడకపోయినా సరైనదాన్ని ఎంచుకునే ధైర్యం ఇవ్వు. నా కోరికలను, నా ఆలోచనలను, నా జీవితాన్ని నీ చేతుల్లో సమర్పిస్తున్నాను.
నీ ఉద్దేశ్యంలో నడవాలని, నిన్ను లోతుగా ఎరగాలి, నాడు నేడు నిన్ను సంతోషపరిచే జీవితం గడపాలని కోరుకుంటున్నాను.
ఆమేన్.
