ఎవరూ ఊహించని వ్యక్తి

ఎవరూ ఊహించని వ్యక్తి

నిర్గమకాండము ౩:౧౨
నిశ్చయముగా నేను నీకు తోడై యుందును

ఆర‌వ్ అనే ఒక యువకుడు ఉన్నాడు. అతను నిన్ననేడు కష్టపడి పని చేసేవాడు కానీ ఎప్పుడూ ఎవరూ గమనించేవారు కాదు. పని చేసినదంతా ఇతరుల పేర్లకు వెళ్ళేది. అతని కృషి కనిపించేది కాదు, ఆలోచనలు వినబడేవి కావు.

కొన్నిసార్లు అతనికి ఇలాగు అనిపించేది —

“బహుశా నేను పెద్దగా ఏదీ చేయలేనేమో…”

ఒక సాయంత్రం నిరుత్సాహంగా ఒక పార్క్ బల్లపై కూర్చున్నాడు. అక్కడ ఒక ముసలి తోటమాలి రాళ్లతో నిండిన నేలలో చిన్న మొక్కలు నాటుతున్నాడు.

ఆర‌వ్ అడిగాడు: “తాతయ్య… ఇంత కఠినమైన నేలలో చెట్లు ఎలా పెరుగుతాయి?”
ఆ ముసలాయన నవ్వుతూ అన్నాడు —

“కఠిన నేలలో పెరిగే విత్తనాలు
బలంగా నిలబడటం నేర్చుకుంటాయి.”

ఆ మాటలు అతని గుండెను తాకాయి. ఆ రాత్రి అతను బైబిల్లో చదువుతుండగా ఒక వచనం కనిపించింది —

“నేను నీతో కూడ నుండెదను.” — నిర్గమకాండము 3:12

ఆ వచనం మోషే గురించినది.

మోషేకు అనుకునే వాడు నేను ఎందుకు పనికిరనివాడని..
నా వల్ల ఏది సాద్యం కాదు అనుకునె వాడు…
ప్రజలు కూడా అతనిని అంగీకరించలేదు.

అయినా కూడా — దేవుడు ఆయనను ఎంచుకున్నాడు.

అతను పరిపూర్ణుడు కాబట్టి కాదు…
అతనికి ప్రతిభ ఎక్కువ కాబట్టి కాదు…
దేవుడు కృపగలవాడు కాబట్టే.

మిత్రమా…
ఈరోజు నీ జీవితంలో కూడా ఆర‌వ్ లాంటి పరిస్థితి ఉండవచ్చు — గుర్తింపు రాకపోవడం… కష్టపడి పనిచేసినా కనిపించకపోవడం…

కాని మోషేను జ్ఞాపకం చేసుకో. అతను కూడా తిరస్కారాన్ని ఎదుర్కొన్నాడు… సందేహాలను ఎదుర్కొన్నాడు అయినా దేవుడు అతనితో ఉన్నాడు.

అదే దేవుడు ఈరోజు నీతో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. నీవు నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే — ఆయన నీ జీవితాన్ని కొత్తగా మార్చగలడు.

ఆర‌వ్ గ్రహించాడు:
తిరస్కారం, ఓటమి కాదు!
ఆలస్యం, శిక్ష కాదు!
అది సిద్ధం చేసే కాలం అని.

ఆ నాడు అతని చుట్టు ఉన్న పరిస్థితులు మారలేదు… కానీ అతని లోపల మార్పు వచ్చింది.

తనను తాను తక్కువగా చూడడం మానేశాడు. ఇతరులతో పోల్చుకోవడం మానేశాడు.

అతని మదిలో అనుకున్నాడు —

“యేసయ్యా… నువ్వు నాతో ఉంటే — అంతే చాలూ.”

యేసు అతని ప్రార్థన వినాడు…
అతని కృషికి ఆశీర్వాదం నిచ్చాడు.

మూయబడిన తలుపు తెరుచుకున్నాయి.
అతని పని గుర్తింపు పొందింది.

దేవుడు ముందే అరవ్ లో చూసిన విలువను, ప్రజలు చివరకు గమనించారు…

అరవ్ ఆశీర్వదింపబడడు, ప్రపంచం అంగీకరించినందుకు కాదు…
దేవుడు బలాన్నిచ్చినందుకు.

ఏవరు నీతో ఉన్నారు మిత్రమా?

ప్రార్థన

యేసయ్యా,
నన్నెవరూ గమనించడంలేదని అనిపించినప్పుడూ
నాతో నీవున్నావని నాకు జ్ఞాపకం చేయు.

నిరుత్సాహంగా ఉన్నప్పుడు ధైర్యం ఇవ్వు,
తిరస్కారం వచ్చినప్పుడు బలం నిచ్చు దేవ వందనం.

నీ సమయాన్ని నమ్మే హృదయం ఇవ్వు.
నా జీవితాన్ని నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను.

నా జీవితాన్ని నీవే నడిపించు.

ఆమెన్.

Discover more from దైవ పిలుపు

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading