కీర్తన ౭౩:౨౬ నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు.
ఈ వాక్యం మనకి ఒక గొప్ప విషయాన్ని గుర్తుచేస్తుంది అదేమిటి అంటే: మన శక్తి పరిమితమైనది, మన తెలివి కూడా పరిమితమైనది.
ఎప్పుడైతే మనం మన తెలివిని, శక్తిని పూర్తిగా ఆధారం చేసుకోకుండా దేవుడికి కృతజ్ఞత చెబుతూ “దేవ నాకు ఇచ్చిన శక్తి, తెలివితేటలును బట్టి నీకు వందనాలు. కానీ నేను చేయాల్సిన పనులు చాలా గొప్పవి. నా శక్తికి, తెలివికి మించినవి. నీవు నాకు చేయుతనిస్తే తప్పక నేను విజయాన్ని పొందుతానయ. నా ఊహకు మించిన చోటున నీవు నన్ను నిలబెట్టవాడవు” అని ఎప్పుడైతే ఈలాగున దేవుని అడుగుతావొ తప్పకుండా ఆయన నీకు చేయుతనిస్తాడు.
