నీకు తోడైయున్నాను భయపడకుము

నీకు తోడైయున్నాను భయపడకుము
యెషయా ౪౧:౧౦
నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.

ఈ లేఖన వచనం అణచివేయబడిన, విడిచిపెట్టబడిన వ్యక్తుల కోసం వ్రాయబడినది, కానీ దేవుడు వారికి భరోసాఇస్తున్నాడు. వారిని ఆదుకున్న అ దేవుడు ఇప్పటికీ నిన్ను పట్టుకుని ఉన్నాడు. నీవు ఒంటరివాడవు కాదు అని ఈ వచనం నీకు గుర్తు చేస్తుంది.

నీవు ఏ విషయం చేత బాధపడుతున్నావొ ఇబ్బంది పడుతున్నావొ లేదా సమస్యల గుండా వెళ్తున్నావొ నాకైతే ఏమి తెలీదు. కానీ! పరముందున్న ఆ తండ్రి సంస్థము ఎరిగి ఉన్నాడు. అందుకనే అంటున్నాడు భయపడవద్దు, ఇక మీదట నీవు భయపడ మాకు. ఆయన చిత్తాన్ని నమ్ము ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవు ఆయనను వెంబడిస్తే చాలు ఆయన నీకు తప్పకుండా చేయూతనిస్తాడు. నీ ఎదుట మూయబడిన తలుపులు తెరవగల గొప్ప దేవుడు ఆయన.

ఈలాగున ప్రార్థించు:
ఏసయ్య నా సమస్యలు ఇబ్బందులు మీరు యెరిగి ఉన్నారు. కాబట్టి నాకు దయచేసి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. మీకుస్టడీగా జీవించే శక్తిని దయ చేయమని కోరుకుంటున్నాన్ అయ్యా

Discover more from దైవ పిలుపు

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading